17 March 2007

telugu lyrics - vETUri paaTalu - 1.

వేటూరి చిలిపి పాటల్లో ఈ పాటకి కూడా పెద్ద పీట వెయ్యాలి...
గొప్ప చిలిపితనం...ఇంత గొప్ప చిలిపితనం పొంగుతున్న పాటను వేటూరిగాక ఇంకెవరు రాయగలరు చెప్పండి?

చిత్రం : కొండప్ల్లి దొంగ
సంగీతం : మ్యాస్ట్రో ఇళయరాజ
గాయకులు : బాలు, జానకి

పల్లవి :
కోలో కోలమ్మ గళ్ళకోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా
ఇంతకు ముందొకసారి మన హెరొయిన్ కోకని కొండగలెత్తుకు పొయిందండి... ఇది చూసి మన కాకికి కోపమొచ్చి తన సత్తా ఏమిటో చూపించాలనుకుంది...
చేలో నీసోకులన్ని సోలోగ పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా
లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిళ్ళిచ్చి మాటుకోమంటావా
ఆంగల పాదాలను ఎంత అందంగా తెలుగు పదాలుగా మార్చేశారో

చరణం 1
కొండకోనల్లో చాటుగా ఎత్తుపల్లాలు తెలిసెలే
కంటికోనాలు సూటిగా కొంటె బాణాలు విసిరెలే
సోకి నా ఒళ్ళు కోకలో గళ్ళు పడ్డ నీ వొళ్ళు వదలను
చూపుకే సుళ్ళు తిరిగె నా వొళ్ళు పట్టు కౌగిళ్ళు వదలకు

ఈ లైన్‌లో జానకి గారు మరీ చిలిపిగా పలికించి పులకరింపచేస్తారు
కుదేశాక అందాలన్నీ కుదేళ్ళైన వేళల్లో
అందాల్ని తాకట్టు పెట్టేశాక ఇంకేముందీ? అంతా మన హెరొ గారికే :)
పడేశక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో

చరణం 2

మెత్తగా తాకుచూపుకే మేలుకొన్నాయి సొగసులే
కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే
కుఱ్ఱ నా ఈడు గుఱ్ఱమై తన్నే గుట్టుగా గుండెలదరగా
కళ్ళతో నీకు ఖల్లెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా
బరోసాల వీరా రారా బరిస్తాను నీ సత్తా
శ్రుతే మించు శృంగారంలో రతే నీకు మేనత్త

వేటూరి గారి చిలిపితనముతో పాటు ఎదిగిన రతి మేనకోడలు, ఈ మధ్య మరో యుగళ గీతం లో "సొంపులకే సొంత మేనత్త" అయ్యింది."చిల్లరి గిత్తా సొంపుల సొంతమేనత్తా మారుస్తా మన్మధగీత తల్లో రాతా" - చిత్రం : అర్జున్.
ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే కోలో...

No comments: