18 March 2010

mainAyE mainAvE...


అది ఒక మాఘమాసపు సందెవేళ.

గోదావరీ తీరం, పోతపోసిన ఇసుక.

సలసలమని సవ్వడి చేస్తూ నడుస్తుంది నది

చుట్టు పచ్చని దుప్పటి పరిచినట్టున్న వరిపొలాలు.

కంటికి కనపడే వరకు ఎవరూలేని ఏకాంతం.

తన మేను తాకీ తాకించకుండ రవి చెయ్యి పట్టుకుని

నడుస్తుంది మాధవి.


పడమటి సూర్యుడు వాళ్ళ తీరు చూసి సిగ్గుపడి దాగ్కుంటున్నాడు.

చల్లగాలి తన విసురును కొంచం పెంచి వాళ్ళను మైమరిపిస్తుంది...


మాధవి కళ్ళల్లోకి చూశాడు. కైపెక్కిస్తున్నాయి. ముద్దుపెట్టుకోవాలనిపించిన తన

కోరికను మౌనంలో కరిగించేశాడు...

మాధవి మాత్రం మనసులో అనుకుంటుంది, "కొంచం హద్దు దాటచ్చుగా?"


ఇక మన తప్పుకుందాం. ఇకపై గురువుగారు వేటూరికి అప్పచెప్పేద్దాం వాళ్ళిద్దరిని...


======================


చిత్రం : మా అన్నయ్య

గానం : ఉన్నికృష్ణన్ & చిత్ర

సంగీతం : ఎస్. ఏ. రాజ్ కుమార్

రచన : వేటూరి సుందరరామముర్థి


||పల్లవి ||

రవి

మైనాయే మైనావే మన్మథ మాసం

అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

తీయనైన తీరిక తీర్చమంది కోరిక

నీకు తోడు నేనిక నీవు లేక లేనిక

సాగు అల్లిక కొన సాగనీ ఇక

పూల మాలిక చెలి పూజకే ఇక

మాధవి

మైనాయే మైనావే మన్మథ మాసం

అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం


||చరణం 1||

రవి
విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు

చలిగాలి సాయంత్రాల స్వాగతమే

మాధవి
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు

ఎదతోనే ముందుగచేసే కాపురమే

రవి
ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా

మాధవి
ఈ పూవుల్లో పూవై నిను పూజిస్తూ ఉన్నా
       ||మైనాయే...||


||చరణం 2 ||

మాధవి
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు

దాటేస్తే కాదన్నానా ఎపుడైనా

రవి
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు

కాటేస్తే కాదంటానా ఇపుడైనా

మాధవి
వయసేమైనా సొగసేమైనా మైమరపించే మనసేమైనా

రవి
నవ్వు నవరాత్రి తీసుకు వస్తున్నా      
||మైనాయే...||




In RTS Format :



adi oka maaghamaasapu sandevELa.
gOdAvarii teeram, pOtapOsina isuka.
salasalamani savvaDi chEstU naDustundi nadi
chuTTu pacchani duppaTi parichinaTTunna varipolaalu.
kanTiki kanapaDE varaku evarUlEni EkaantaM.
tana mEnu taakii taakinchakunDa ravi cheyyi paTTukuni
naDustundi maadhavi.

paDamaTi sUryuDu vALLa teeru choosi siggupaDi daagkunTunnaaDu.
challagaali tana visurunu koncham penchi vaaLLanu maimaripistundi...

maadhavi kaLLallOki chUSaaDu. kaipekkistunnaayi. muddupeTTukOvAlanipinchina tana
kOrikanu mounamlO kariginchESADu...
maadhavi maatram manasulO anukunTundi, "konchaM haddu dATacchugaa?"

ika mana tappukundAM. ikapai guruvugaaru vETUriki appacheppEddaam vaaLLiddarini...

===================================

chitraM : mA annayya
gAnaM : unnikRshNan & chitra
sangItaM : es. E. rAjkumAr
rachana : vETUri sundararAmamurthi

pallavi :

ravi
mainaayE mainaavE manmatha mAsaM
ayinaa entainaa idi mettani mOsaM
teeyanaina teerika teerchamandi kOrika
neeku tODu nEnika neevu lEka lEnika
saagu allika kona saaganii ika
pUla maalika cheli pUjakE ika


mAdhavi
mainaayE mainaavE manmatha mAsaM
ayinaa entainaa idi mettani mOsaM



charaNaM

ravi
virahAla niTTUrpu virajAji OdArpu
chaligaali saayantraala swaagatamE


mAdhavi
paipaikocchE taapaalu paiTammicchE Saapaalu
edatOnE mundugachEsE kApuramE


ravi
evarEmainaa edurEmainaa nEnEmainaa neevEmainaa

mAdhavi
ee pUvullO pUvai ninu pUjistU unnaa


charaNaM 2

mAdhavi
sandepoddu nEraalu andamaina teeraalu
dATEstE kaadannaanaa epuDainaa


ravi
kavvistunna nee kaLLu kaipekkinchE pOkaLLu
kATEstE kaadanTaanaa ipuDainaa


mAdhavi
vayasEmainaa sogasEmainaa maimarapinchE manasEmainaa

ravi
navvu navaraatri teesuku vastunnaa

No comments: